ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహం పెట్టనున్నట్లు ఆ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. ఇప్పటికే ప్రముఖ సినీ తారల విగ్రహాలు మైనంతో చేసి ప్రజల సందర్శనార్ధం మ్యూజియంలో పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దివంగత నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో సెప్టెంబర్ ఉదయం 4 గంటలకు ఆవిష్కరించనున్నట్టు వారు తెలిపారు. అంతేకాకుండా ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయన్నున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa