నాపై కుట్ర చేస్తున్నారు , అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ చిత్రం పై విషం చిమ్మారు అంటూ డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలైన సమయంలో తన సన్నిహితుల వద్ద వాపోయాడట హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు ఆ మాటలు నిజమే అని తెలుస్తోంది ఎందుకంటే తాజాగా డియర్ కామ్రేడ్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రానికి అత్యధికంగా వ్యూస్ వచ్చాయి, పైగా ఈ సినిమాని చూసిన వాళ్ళు ఇంత మంచి సినిమా చూడకపోయామే! అంటూ కామెంట్లు కూడా పెట్టారు.
డియర్ కామ్రేడ్ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో విడుదల కాగా అన్ని భాషల్లో కూడా ప్లాప్ అయ్యింది. అయితే కంటెంట్ బాగున్నప్పటికీ సినిమా నిడివి ఎక్కువ కావడమే మైనస్ గా మారింది, దానికి తోడు విజయ్ దేవరకొండకు అనూహ్యమైన క్రేజ్ రావడం కూడా కొంతమందికి కంటగింపుగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa