నాని హీరోగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన `నాని`స్ గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని ఈ రోజు సాయంత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ 3 హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సీజన్ 3కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. బిగ్‌బాస్ 2కి నాని హోస్ట్‌గా ఉన్నప్పుడు నాగార్జున, నాని కలిసి నటించిన `దేవదాస్` ప్రమోషన్ కోసం నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బిగ్‌బాస్ 3ని నాగ్ హోస్ట్ చేస్తుంటే..నాని హౌస్‌లోకి గెస్ట్‌గా అడుగుపెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa