బాలీవుడ్ యంగ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. విడుదలకు ముందుగా ప్రమోషన్లలో భాగంగా ఈ జంట ముంబైలోని ప్రసిద్ధ గణపతి మండపం లాల్బాగ్చా రాజాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశ్ చతుర్థి వేళ జరిగిన ఈ సందర్శనలో జాన్వీ ఎర్రటి పైఠానీ చీరలో, సిద్ధార్థ్ పింక్ కుర్తాలో ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa