by Suryaa Desk | Thu, Oct 10, 2024, 03:33 PM
ధృవ సర్జా నటిస్తున్న హై-బడ్జెట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ 'మార్టిన్' అక్టోబర్ 11న అంటే రేపు విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సీనియర్ హీరో అర్జున్ స్క్రిప్ట్ అందించారు. ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, అరబిక్, జపనీస్, చైనీస్, కొరియన్ మరియు రష్యన్ తో సహా 12 భాషల్లో విడుదల కానుంది. ధృవ సర్జా తన 2021 చిత్రం "పొగరు" తర్వాత "మార్టిన్" తో పెద్ద తెరపైకి తిరిగి వస్తున్నాడు. AP అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైభవి శాండిల్య, మాళవిక అవినాష్ మరియు అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉదయ్ కె మెహతా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుండగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
Latest News