మొర్రిపండ్ల కోసం చెట్టు ఎక్కిన యువతి కింద పడి మృతి చెందిన ఘటన రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. షేర్ శంకర్ తండా జిపి పరిధిలోని 3 మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ భూలి(22)తన తల్లి లక్ష్మి, స్థానికులతో కలిసి మొర్రిపండ్లు తెంపేందుకు వెళ్లింది. చెట్టుపైకి ఎక్కి పండ్లు తెంపుతున్న క్రమంలో కింద పడింది. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంపత్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa