ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 04:28 PM

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. సూర్యాపేట జాతీయరహదారిపై బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతులు నవీద్ , నిఖిల్ రెడ్డి, రాకేష్ గా గుర్తించారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో వ్యక్తి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa