మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరంగల్,ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది అశోక్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. లైబ్రరీ నుండి అంబేద్కర్ విగ్రహాం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. తాను నిరంతరం నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం పోరాడుతున్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులే పోటి చేస్తున్నారని విమర్శించారు. బ్యాలెట్ లో 18వ నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa