సమ్మర్‌లో ట్రైన జర్నీ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వటంతో పాటు కొందరు దూర ప్రాంతాలకు టూర్లు ఫ్లాన్ చేసుకుంటారు. దీంతో ట్రైన్లలో సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేశారు.
సంబల్‌పూర్-కాచిగూడ ట్రైన్ మే 27 నుంచి జూన్ 24 వరకు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సంబల్‌పూర్‌లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు రాయగడ చేరుతుందని చెప్పారు. ఉదయం 5.30 విజయనగరం , ఉదయం 7.20 దువ్వాడ గంటలకు చేరి.. ఏపీలోని వివిధ స్టేషన్ల మీదుగా రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుతుందని చెప్పారు.
తిరుగు ప్రయాణంలో మే 28 నుంచి జూన్ 25 వరకు నడిచే ట్రైన్ కాచిగూడలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుతుందని వెల్లడించారు. విజయనగరం మధ్యాహ్నం 1.50 గంటలకు, రాయగడకు సాయంత్రం 4.05 గంటలకు చేరుతుందని.. సంబల్‌పూర్ రాత్రి 11.45 గంటలకు చేరుకోనున్నట్లు తెలిపారు.
సంబల్‌పూర్-ఎస్‌ఎంవీ బెంగళూరు స్పెషల్ ట్రైన్ మే 30 నుంచి జూన్ 27 వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంబల్‌పూర్‌లో సాయంత్రం 6.45 గంటలకు ట్రైన్ బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 4.55 గంటలకు దువ్వాడ చేరుతుందని అన్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి బయల్దేరి రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుకోనున్నట్లు వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు నడుస్తుందని అన్నారు.
ఈ ట్రైన్ బర్‌గార్‌రోడ్డు, బలంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాటపడి, జోలార్ పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుందని స్పష్టం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa