ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఇంటర్మీడియట్ చదివేందుకు కార్పొరేట్ కళాశాలలకు ఎంపికైన విద్యార్థులకు గురువారం నారాయణపేట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి ప్రవేశ పత్రాలను అందజేశారు. మొత్తం 9 మంది ఎంపికైనట్లు చెప్పారు. క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పారు. విద్యలో రాణించి జిల్లాకు, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. కళాశాలలో ఎలాంటి ఫీజులు ఇవ్వరాదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa