జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని చారిత్రక ఆలయంలో సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే కొలువు దీరినట్టుగా, కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు ప్రార్థిస్తుంటారు. ఈ లక్ష్మి వైకుంఠ నారాయణుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంభమవుతున్నాయి. 8 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గురువారం ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు ఆలయ పూజారి గోపీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa