ఖమ్మంలోని రోటరీ నగర్లో శుక్రవారం చోరీ జరిగింది. రోటరీ నగర్లో ఉన్న కిరాణ షాపునకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి షాపు నిర్వాహకురాలు లక్ష్మిని పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. ప్యాకెట్ ఇస్తుండగానే ఆమె మెడలోని బంగారు నానుతాడు లాక్కుని పరారయ్యాడు. రూ. 2. 50లక్షల విలువైన గొలుసు చోరీపై బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం టూటౌన్ పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa