పదవి కాలం పూర్తి చేసుకున్న జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు సదాశివనగర్ మండల పరిషత్ కార్యాలయం తరపున బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ కమిలి నర్సింలును, ఎంపిపి గైని అనసూయ రమేష్ ను, వివిధ గ్రామాల ఎంపీటీసీలను శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ గంగసాగర్, ఎంపీవో సురేందర్ రెడ్డి, చారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa