త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా మంగళవారం అమ్మ మాట - అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు - బలపం పంపిణీ చేసి అనంతరం అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల నుంచి ఐదున్నర ఏళ్ల లోపు పిల్లలను అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa