కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ నిరుద్యోగ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో మంగళవారం బిజెపి ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం మాట మార్చి కొందరు రైతులకే రుణమాఫీ చేశారని అన్నారు. తక్షణమే ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa