రైతు భీమా కోసం దరఖాస్తులు చేసుకోవాలని భిక్నూర్ మండల ఏవో రాధ బుధవారం చెప్పారు. ఆమె మాట్లాడుతూ, కొత్తగా పట్టా పాస్ బుక్కు పొందిన రైతులు పూర్తి వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇట్టి అవకాశం ప్రభుత్వం ఆగస్టు 5 వరకు కల్పించిందని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రైతు భీమాలో నామిని పేరు మార్పు కోసం ఈనెల 30 వరకు అవకాశం ఉందని, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa