వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 11. 69 లక్షల విలువగల 45 చెక్కులను వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ ఛైర్మన్ పాకనాటి కృష్ణ బుధవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో 1, 2, 4, 7, 8, 9, 10, 11, 13, 24, 30, 33 వార్డుల కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీరల చందర్, సమన్వయకర్త లక్కాకుల సతీష్, డి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa