మహబూబ్ నగర్ డిపో నుంచి తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఆగస్టు 17 శనివారం రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని, అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 19న మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనమవుతుందని, రూ. 3, 600 టిక్కెట్ ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99592 26285, 94411 62588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa