ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటిఆర్‌తో సమావేశమైన శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలేందిరన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2024, 06:59 PM

2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేళ్ల కాలంలోనే సాధించిన అద్భుత ప్రగతి గురించి.. గతంలో తాను శ్రీలంక పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా కేటిఆర్‌కు తెలిపిన సతాశివన్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే.. సింగపూర్‌ను తలపించేలా ఉందని ప్రశంసించిన శ్రీలంక మంత్రి ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటిఆర్ తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన తీరును అభినందించిన సతాశివన్ ఓవైపు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్న సతాశివన్ తెలంగాణలో ఓవైపు ఐటీ, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్, మరోవైపు ఫార్మా రంగాలకు ఏకకాలంలో పెద్దపీట వేసి పారిశ్రామిక రంగాన్ని మెరుపువేగంతో పరుగులు పెట్టించడం అరుదైన విషయమని తెలిపిన మంత్రిహైదరాబాద్ వంటి నగరాలే ఏ దేశానికైనా ఆర్థిక ఇంజన్లని, వీటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుందని పేర్కొన్న శ్రీలంక మంత్రి  ఓసారి తాను చెన్నైలో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడి పోలీసు అధికారితో మాట్లాడానని, తమిళనాడు కంటే.. తెలంగాణ పోలీసులకే ఎక్కువ వేతనాలు అందుతున్నాయనే విషయాన్ని అతను చెప్పారని గుర్తుచేసిన సతాశివన్ ఈ సందర్భంగా  కేటిఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లపాలనను ఓ యజ్ఞంలా సాగించామని, అందుకే అనతికాలంలోనే అసాధారణ ఫలితాలు సాధించగలిగామని వెల్లడించారు .తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లో సంపదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లెపల్లెనా పేదలకు పంచామని కేటిఆర్ తెలిపారు.పారిశ్రామిక రంగానికేకాదు.. పర్యావరణానికి కూడా సమప్రాధాన్యం ఇచ్చామని, తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచడం దేశంలోనే అరుదైన రికార్డు అని గుర్తుచేశారు.తెలంగాణకు హరితహారం పేరిట చేపట్టిన కార్యక్రమం మానవ చరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రయత్నమని వెల్లడించారు.చిన్న వయసులోనే శ్రీలంక ఎంపీగా, కేంద్రమంత్రిగా ఎదగడంపట్ల అభినందనలు తెలిపి.. సతాశివన్‌ను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసిన కేటీఆర్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa