కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పూడూరు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్ ముదిరాజ్ ని పరామర్శించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగస్టు 16న తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కడ్మూర్ ఆనందం, అతని అనుచరులు కలిసి ప్రభుత్వ భూముల కబ్జాలకు అడ్డుపడుతున్నడు అనే ఆలోచనతో రాఘవేందర్ ముదిరాజ్ పై తన రివాల్వర్ తో బెదిరించి దాడికి పాల్పడడం జరిగింది.
ఈ విషయము తెలిసిన వెంటనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది.ఈరోజు రాఘవేందర్ ముదిరాజ్ ని పరామర్శించిన అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి, ఉప్పరి రమేష్, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa