మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో డీఎస్పీ వెంకట్ రెడ్డి గణేష్ మండప నిర్వాహకులతో గురువారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ నుంచి కూడా ఉచితంగా విద్యుత్తు అందజేస్తున్నందున అనుమతులు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు కలగకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని గణేష్ మండప నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉత్సవాలు ఉండకూడదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa