ఆదిలాబాద్‌లోని జైజవాన్ నగర్ అంగన్వాడీ సెంటర్లో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో పోషక ఆహార విలువల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో చేసిన పాయసం, ఉప్మా, రాగి జావా, తదితర వాటిని విద్యార్థులకు తినిపించారు. అదేవిధంగా తయారీ విధానం వివరించారు. వీటివల్ల శరీరానికి లాభాలు చేకూరుతాయని తెలిపారు. కేంద్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ వి. రవికుమార్, సూపరిటెండెంట్ గౌతమ్, తదితరులున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa