పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ తమ భాద్యత గా గుర్తించాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.స్వచ్చత హి సేవ కార్యక్రమములో భాగముగా మంగళవారం మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంప్ ను స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దున లేవగానే మన కళ్ళ ముందు కనిపించేది పారిశుద్ధ కార్మికులేనని, డెంగ్యూ ,ఇతర విషజ్వరాల బారిన నుండి ప్రజలను రక్షించడం లో పారిశుధ్య కార్మికుల పాత్ర అభినందనీయమని అన్నారు.పారిశుద్ద కార్మికుల సమస్యలను పరిష్కారంకు తమ బాధ్యత గా చొరవ చూపాలని వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చేలా కమిషన్ కమిషనర్ చూడాలని అది మన బాధ్యత అని అన్నారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణమును పరిశుభ్రముగా ఉంచడములో ముఖ్య పాత్ర పోషించే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ మా యొక్క భాద్యత అని అన్నారు.
కార్మికులకు ఈ.యస్.ఐ భీమ కల్పించడమే కాకుండా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కార్మికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ క్యాంప్ లో అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇ. పి.ఎఫ్ ఉమ్మడి జిల్లా కమిషనర్ తానయ్య, మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు క్యాదాసు నవీన్,అనుమల జయశ్రీ ,దుర్గయ్య, అల్లే గంగ సాగర్, శానిటేషన్ అధికారులు,మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, నాయకులు గాజుల రాజేందర్,మొగిలి, రజనీకాంత్, వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa