ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాసంగిలో వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:05 PM

జగదేవపూర్  మండలం లోని రైతు వేదిక తీగుల్ యందు రైతు సోదరులకు  యాసంగి లో వేరుశనగ సాగులో చేపట్టవలసిన  యాజమాన్య పద్ధతులను  హైదరాబాదు నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్త  డాక్టర్ రామిరెడ్డి  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం వారు శ్రవణ దృశ్యం మాధ్యమం ద్వారా రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రైతులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి రాధిక,  మండల వ్యవసాయ అధికారి వసంతరావు,  వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శరణ్య, సమత, భాను ప్రకాష్, ఖలీల్, కృష్ణమూర్తి, కిరణ్ మరియు వివిధ  గ్రామాల  రైతులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి  రాధిక గారు మరియు మండల వ్యవసాయ అధికారి వసంతరావు తీగల్ గ్రామంలోని వరి పంటను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు ప్రస్తుతం వరి  పంట పొట్ట దశ నుండి ఈనిక దశ వరకు ఉందని ఈ సమయంలో తెల్ల కంకులు రాకుండా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 s.p 2 గ్రా. లేదా ప్రోపినో ఫాస్ 2 మి. లీ లేదా క్లోరాం ట్రానిలిప్రోల్ 20 S.P 0.4 మి. లీ లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలని సూచించారు. అలాగే వరిలో ఆకు ముడత నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మి. లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా.లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలని పోటాకు దశలో క్లోరాం ట్రానిలిప్రోల్ 20 S.P 0.4 మి. లీ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 s.p 2 గ్రా.లు లేదా ఫ్లూబెండమైడ్ 20 w.d.g  0.25 గ్రా లేదా  ఫ్లూబెండమైడ్ 48 S.P 0.1 మి. లీ లీటర్ నీటి కలిపి చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa