ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:06 PM

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాజులరామారం డివిజన్ కైసర్ నగర్, హెచ్ఏఎల్ కాలనీ కి చెందిన బుట్టి, సంపూర్ణల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బుట్టి తండ్రి జోషెడ్ కి (రూ.50,000/-), సంపూర్ణ భర్త పి. వెంకటేశ్వర రెడ్డి (1,10,000/-) లకు మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa