ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు 74 వ జయంతి వేడుకలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 02:46 PM

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు 74 వ జయంతి సందర్బంగా సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం రోజున రాజమల్లు నివాసంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..అనంతరం రాజమల్లు జయంతి సందర్బంగా 55 మంది మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు,చీరలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే..ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ..సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించిన రాజమల్లు విగ్రహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్డులో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మొదటి వర్ధంతి వరకు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.
ఎల్ఎంబి బ్యాంకు చైర్మన్ గా,సర్పంచ్ గా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా రాజమల్లు సేవలందించి ప్రజల హృదయలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు. రాజమల్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాజమల్లు సతీమణి బిరుదు సుశీల, బిరుదు కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa