ట్రెండింగ్
Epaper    English    தமிழ்

65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 12:23 PM

సూర్యాపేట జిల్లాలో గల 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పలు ట్రావెల్స్కు చెందిన మూడు ప్రైవేట్ బస్సులు , ఓ డీసీఎం వ్యాన్ ఒకదానికొకటి వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తోన్న డీసీఎం ఢీకొట్టగా.. దాని వెనకాలే వస్తున్న మరో రెండు బస్సులు డీసీఎంను బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలవ్వగా..


బస్సుల్లో ప్రయాణించే మరో ఇద్దరు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. మిగతా 80 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. అర్థరాత్రి బస్సులు రోడ్ల మీద నిలిచి పోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో విజయవాడ వైపు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటలసేపు రోడ్డు మీదనే వాహనాలు నిలిచిపోగా.. ఎట్టకేలకు పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa