ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగ మేళాను సద్వినియోగపరచుకోండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:34 PM

మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్  ఇల్లందుల శ్రీనివాస్ శుక్రవారం కరపత్రాలను విడుదల చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి  సంస్థలైన హెచ్డిఎఫ్సి, ముత్తూట్ ఫైనాన్స్ మరియు ఇతర కంపెనీలకు సంబంధించి టైమ్స్ ప్రో ఆధ్వర్యంలో  ఇంటర్వ్యూలు  జరగనున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారు  జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాదులో సైతం ఖాళీలు ఉన్నట్లు వివరించారు. ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్  రాజు,  అధ్యాపకులు శివ, సుధాకర్, రాజేష్, రాజపాల్ లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa