ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన అమరబోయిన పాపారావు(32) కొద్ది నెలల క్రితం ఫైనాన్స్ లో ఆటో కొన్నాడు.నెలకు రూ.10 వేలు కిస్తీ కట్టాల్సి ఉండగా, ఆటో నడవకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు.శుక్రవారం రాత్రి 1 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిన పాపారావు.. భార్యతో గొడవ పడి, భార్యాపిల్లల్ని బలవంతంగా బయటకు పంపి ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa