ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నానం చేసే సమయంలో వీపు తోమాలన్న భర్త.. కోపంతో తల పగులగొట్టిన భార్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:56 PM

దంపతలు మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండవని పెద్దలు అంటూ ఉంటారు. అయితే కొందరు దంపతులు చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసుకొని గొడవలకు దిగుతూ ఉంటారు. క్షణికావేశంలో దాడులకు కూడా పాల్పడుతుంటారు. కొన్నిసార్లు వారు గొడవ పడిన తీరు.. కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇటువంటి వాటికి కూడా గొడవలకు దిగుతారా.. ? అని అనిపిస్తుంది.


తాజాగా.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అటువంటి ఘటనే చోటు చోసుకుంది. స్నానం చేసే సమయంలో వీపు తోమాలని భర్త గట్టిగా కేకలు వేయగా.. కోపంతో ఊగిపోయిన భార్య క్షణికావేశంలో ఐరన్ రాడ్‌తో భర్త తలపై కొట్టి గాయపరిచింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడవ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాకు చెందిన శివ తన భార్య రజిత ఇద్దరు పిల్లలతో కలిసి మూడవ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం స్నానానికి వెళ్లిన శివ.. తన వీపుతోమాలని భార్యపై గట్టిగా కేకలు వేశాడు.


దీంతో కోపంతో అక్కడకు చేరకున్న భార్య రజిత.. చుట్టుపక్కల అందరూ వింటున్నారని అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావంటూ శివతో వాగ్వాదానికి దిగింది. అయినా వినిపించుకోని భర్త.. ఆమెను తిట్టడంతో క్షణికావేశానికి లోనై పక్కనే ఉన్న ఐరన్ రాడ్డుతో భర్త తలపై బలంగా కొట్టింది. ఈ ఘటనలో శివ తలకు తీవ్ర గాయం అయింది. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతడి కుట్లు వేసి ఇంటికి పంపించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన శివ భార్యపై ఫిర్యాదు చేశాడు.


బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు కేపీహెచ్‌బీ సీఐ వెంకటేశ్వర రావు వెల్లడించారు. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని సీఐ తెలిపారు. గతంలో శివపై వరకట్న వేధింపుల కేసు కూడా నమోదైందని చెప్పారు. వీరికి పెళ్లి జరిగి 16 ఏళ్లు అవుతున్నా.. తరుచూ గొడవలకు దిగుతున్నారని.. ఈ క్రమంలోనే భార్య రజిత శివపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. అతడి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రజితపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa