ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్మాత దుర్గామాత అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవములు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:56 PM

దేవి నవరాత్రుల  మహోత్సవంలో  భాగంగా శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి దేవస్థానంలోశనివారం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం అభిషేక సహస్రనామ పూజలు వేదమంత్రాలతో పూజ ఘనంగా నిర్వహించి మరియు పూజ దంపతులు, మహిళ భక్తులచే 101 రకాల నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి మంగళహారతుల ద్వారా ఘనంగా పూజలు చేయడం జరిగింది. ఇట్టి నివేదన కార్యక్రమంలో గెలుపొందిన ఇద్దరు మహిళలకు అమ్మవారి ఆశీర్వాదంతో రెండు చీరలు శ్రీ వనం బిక్షమయ్య భార్య యాదమ్మ సహకారంతో బహుమానంగా ఇవ్వడం జరిగింది.
వారి కుటుంబ సభ్యులపై అమ్మవారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని  భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని దేవస్థానం నుండి అమ్మవారి ఆశీర్వచనం అందించారు అనంతరం మహిళ భక్తులు దేవస్థానం ప్రాంగణంలో కోలాటం నిర్వహించారు ఈ  కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa