ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామపంచాయతీ నిధులను స్వాహా చేసిన మాజీ సర్పంచ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:00 PM

మహబూబాబాద్ జిల్లా, మండల కేంద్రం పరిధిలోని అయోధ్యాపురం 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పదిహేను లక్షల గ్రాంటును ఇస్తామని చెప్పినా ఆనాటి బి ఆర్ ఎస్. రాష్ట్ర ప్రభుత్వం అధినేత కేసిఆర్ మాటలను నమ్మి ఏకగ్రీవం చేసుకుంటే, ఒక్క రూపాయి రాలేదు. సరి కదా? గ్రామ పంచాయితీ నిధులే లూటీ అయ్యాయని వాపోయారు. కెసిఆర్ మాటలు నమ్మి చివరకు మోసపోయామని అన్నారు.
గ్రామ పంచాయతీలో అక్టోబర్ 2న జరిగిన గ్రామసభలో, పలు విషయాలపై చర్చించి గ్రామ పంచాయతీ నిధులపై, గ్రామ కార్యదర్శి అజ్మీర కోటేశ్వరరావును ప్రజలు వివరణ కోరారు. కార్యదర్శి తీర్మానాలను చదివి వినిపించారు. అట్టి తీర్మానాలను బట్టి చేయని పనులకు అయోధ్యాపురం మాజీ సర్పంచ్ గుగులోతు తులసి రామ్ నాయక్ బిల్లులు రికార్డు చేయించుకుని, అట్టి పనుల వివరాలు ఏమి లేకుండానే, ఎం. బి. లు, చేయించుకుని, బిల్లులు తీసుకున్నారని, అంతేకాకుండా అతని పదవీకాలం ముగిసి 9 నెలలు కావస్తున్న ఎం.బి. బుక్కులు, చెక్ బుక్ లను గ్రామపంచాయతీ అధికారులకు గాని,మండలాభివృద్ధి అధికారుల గాని అప్పగించ కుండా, తన చెంతనే ఉంచుకోవడంలో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామ సభలో గ్రామ కార్యదర్శి వివరించడం ఒకింత ఆచార్యానికి గురిచేసింది. గ్రామ పంచాయతీకి సంబంధంలేని మరికొన్ని సొంత  పనులకు, గ్రామ పంచాయతీ నిధులను ఉపయోగించుఉన్నాడని అభియోగం కూడా ఉన్నది. మొదటిసారి చేసిన పనుల మీద రెండోసారి కూడా బిల్లులు చేయించుకున్నట్లు గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి వివరించడం. దీనిక వెనుక బడా రాజకీయ నాయకుల  హస్తం ఉన్నదనే అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఆచార్యానికి గురయ్యారు. వెయ్యిలల్లో  పనులు చేసి, లక్షల్లో బిల్లులు చేయించుకోవడం. వాటికి సంబంధిత ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు ఎంబిలు చేయడం ఎలా సాధ్యం?. దీని వెనుక బడా రాజకీయ నాయకుల, ఇంజనీరింగ్ శాఖ  ప్రభుత్వ ఉన్నతాధికారుల  అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతున్నది.  ఈ విషయంపై కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మొగుల గాని ప్రభాకర్ గౌడ్, పూజారి శంకర్ గౌడ్, మాదాసు రమేష్, భీమగాని శ్రీనివాస్ గౌడ్, కోల శ్రీధర్ గౌడులు కార్యదర్శి తో వాగ్వివాదానికి  దిగగా, ఈ గ్రామ సభకు గ్రామపంచాయతీ  ప్రత్యేక అధికారి జె. రవికుమార్ హాజరు కాని తరుణంలో, దిక్కు తోచని పరిస్థితిలో, కార్యదర్శి గ్రామ సభను తిరిగి, అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై, జరిగిన పలు అవకతవకలపై సమగ్రంగా విచారించి, బాధ్యులపై తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అయోధ్యాపురం గ్రామ ప్రజలు, గూడూరు మండల అభివృద్ధి అధికారి ఎర్ర వీరస్వామికి విజ్ఞప్తి చేశారు. అయోధ్యాపురం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు, మహబూబాబాద్ డిఎల్ఓ పి. కు, గూడూరు ఎంపీఓ. అడ్డగట్ల సత్యనారాయణకు, అయోధ్యాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మొగులగాని ప్రభాకర్ గౌడ్, పూజారి శంకర్ గౌడ్, మాదాసు రమేష్, భీమగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి బాధ్యుడు ముత్యం సురేష్ గౌడ్ లు మెమోరాండాన్ని  సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa