రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు తరువాత 3 రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. సన్నాలను ప్రోత్సహించడానికే 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa