మహారాష్ట్ర డీజీపీగా సంజయ్ కుమార్ వర్మ మంగళవారంనియమితులయ్యారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో డీజీపీ రష్మీ శుక్లాను.. ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తొలగించింది.
దీంతో తాజాగా ఆమె స్థానంలో సంజయ్ కుమార్ వర్మ ఎంపికయ్యారు. ఆమె తదుపరి అర్హత కలిగిన ముగ్గురు ఐపీఎస్ అధికారులలో సంజయ్‌ను డీజీపీగా ఈసీ నియమించింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.