దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్, గాజులపేటలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో పడతాయని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని, ఏ వన్ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2320, సన్న వడ్లకు రూ. 2820 మద్దతు ధరగా ఉంటుందన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.