పవన్ కామెంట్స్ పై మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరం. మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలి. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై మాట్లాడటం దురదృష్టకరం.హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టే. హోంమంత్రిని అనడమే కాదు.. సీఎంను కూడా పవన్ అన్నట్టే అని ఆయన అన్నారు.అయితే నేను ఎన్నికలకు ముందే పవన్ ని వ్యతిరేకించా. మాల లకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వని పవన్ సమాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతాడు.. జనసేన అంటే కమ్మ, కాపు ఓట్లతో మాత్రమే గెలవలేదు. ఎస్సి, ఎస్టి, బిసి లకు మంత్రి ఇవ్వనపుడు ఇదేం సామాజిక న్యాయం. మాట్లాడే సమయం వచ్చినపుడు మేం అన్ని విషయాలు మాట్లాడతాం. కేబినెట్ అంటే కుటుంబం. కానీ పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం.. మా కులానికి అవమానం. రేపు పవన్ మాటలు ఆయన శాఖ కు కూడా వర్తిస్తాయి అని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.