తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ( సామాజిక,ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ, కుల సర్వే శనివారం పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డులో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎటువంటి పొరపాట్లు లేకుండాచూసుకోవాలి అని అలాగే సర్వేకు వచ్చే సిబ్బందికి ప్రజలు వారి వివరాలు తెలియజేసి సిబ్బందికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్,రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య ,మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ ,జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, సూపర్వైజర్ సింధూర ,ఇన్యుమరేటర్స్ సదానందం, మంజుల సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa