రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్దిదారులకు 488 షాదీముబారక్ , 138 కల్యాణ లక్ష్మి, మొత్తం 665 చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సోమవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్ది పొందాలన్నారు. పేదింటి యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa