లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 37 రోజులు జైలు జీవితం గడిపిన జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ప్రస్తుతం తన టైం అంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. మళ్లీ తాను ఎప్పుడు జైలుకు వెళతానో తేలిక ఉన్న సమయంలోనే తన కుటుంబంతో గడిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తాజాగా టూర్‌కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని జానీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తన భార్య, పిల్లలతో కలిసి బీచ్ దగ్గర దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి