విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ డి.ఎస్.పి కొలను శివరామిరెడ్డి హెచ్చరించారు మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 7న 2 గంటలకు నల్గొండ మెడికల్ కాలేజీలోని హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల ర్యాగింగ్ కు పాల్పడినట్లు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రు వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.
ర్యాగింగ్ యాక్ట్ కేసులు నమోదు చేయడం జరిగిందని పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యార్థులందరికీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా విద్యార్థులు ర్యాగింగ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని భవిష్యత్తును కేసులపాలు కాకుండా చూసుకోవాలని బాగా చదివి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలిపారు.