సిపిఎం 21వ జిల్లా మహాసభలు సందర్భంగా డిసెంబర్ 2న మిర్యాలగూడ లో జరిగే బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం సీపీఎం తిప్పర్తి మండల కమిటీ సమావేశం తిప్పర్తి లో నర్రా రాఘవరెడ్డి భవన్ లో జరిగింది. ముఖ్య అతిధిగా సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాలు లేనిదే పాలక పక్షాలు తమ ఇష్టానుసారంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలనా కొనసాగిస్తాయని, ప్రజా వ్యతిరేక విధానాలను నికరంగా నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు.
ప్రజల అభివృద్ధి ఏజెండా పక్కకు పోయి పెట్టుబడిదారులు దోపిడీదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొని దేశాన్ని దివాలా తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం సన్నగిళ్ళకముందే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని సంక్షేమానికి సంబంధించిన నిధులు విడుదల కావడం లేదని అన్నారు.రైతులు పండించిన వరి పత్తి వెంటనే కొనుగోలు చేసి డబ్బులు రైతులు ఖాతాలో వేయాలని అన్నారు సి సి ఐ ద్వారా పత్తిని కొనుగోలు వేగవంతం చేసి పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐయం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి మండల కార్యదర్శి మన్నెం బిక్షం నాయకులు భీమగాని గణేష్ చెనగోని వెంకన్న అకిటి లింగయ్య జంజీరాల సైదులు పోకల శశిధర్ జంజరాల ఉమా మంత్రాల మంగమ్మ మాలి భార్గవి తదితరులు పాల్గొన్నారు.