ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యాల పెంపుకు కృషి చేయాలి.... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 03:31 PM

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  పెద్దపల్లి మండలంలో రాఘవపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,  ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలని, ప్రతి విద్యార్థి పై శ్రద్ధ వహించి చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం.
వంటి సామర్థ్యాలు ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ డిసెంబర్ నెలలో నిర్వహించే మిడ్ల్యాండ్ టెస్ట్ లో వారి యొక్క ఓరల్ రీడింగ్ ఫ్రీక్వెన్సీ, రీడింగ్ కంప్రెషన్ పెంచాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com