ముదిరాజ్ లను బిసిఏ లో చేర్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తోకల రాజేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. మెట్ పల్లి పట్టణంలోని ఆర్ బి సమావేశ మందిరంలో కోరుట్ల నియోజకవర్గ ముదిరాజ్ సంఘ సభ్యుల సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో నవంబర్ 21న నిర్వహించ తలపెట్టిన ముదిరాజ్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ కుల గణన త్వరిత గతిన పూర్తి చేసి జనాభా ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. బీసీ డీ లో ఉన్న ముదిరాజ్ లను బిసిఏ లో చేర్చాలని, ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఆనంద్ బాబు, యామ రాజయ్య, వెల్ముల రాంబాబు, మారంపల్లి శ్రీనివాస్, చిట్యాల లక్ష్మణ్, చేగుంట శ్రీనివాస్, పాతర్ల విజయ్, నేమూరి లక్ష్మణ్, తోకల సత్యనారాయణ, దండవేని రాజేందర్, చిన్నబోయిన హన్మాండ్లు, సాగర్, రమేష్, సాయన్న, సురేష్, రాజన్న, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.