ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 21, 2024, 04:00 PM

నర్సంపేట మండల మూడవ మహాసభ మహేశ్వరం గ్రామంలో మండల కమిటీ సభ్యులు మలహల్ రావు, బుర్రి ఆంజనేయులు, కత్తి కట్టయ్య, ఎస్. కె అన్వర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పాలన కొనసాగిస్తుంది . మోడి అధికారం లోకి వచ్చిన తరువాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి దేశంలో ఆకలి చావులు పెరిపోయాయి అన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై దేశ వ్యతిరేకులు గా ముద్రవేశి జైల్లో పెడుతూ దేశంలో అప్రటిత ఎమర్జెన్సీ అమలుచేస్తుంది మోడి ప్రభుత్వము వచ్చి రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేఖంగా దేశ రాజధాని ఢిల్లీలో సుదీర్ఘ కాలం రైతాంగం ఆందోళన చేస్తే వ్రాత పూర్వక హామీలిచ్చి నల్లచట్టలను విరమించుకున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ రోజు వరకు అమలు చేయలేదని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.
ఈ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు మోడి ప్రభుత్వము ప్రయత్ని స్తుంది. మోడీ ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టడా నికి ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో గత సంవత్సరం అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. పూర్తి స్థాయిలో రైతు ల రుణమాఫీ పూర్తి కాలేదు. రెండు వ్యవసాయ సీజ ను పూర్తి అయినప్పటికీ రైతు భరోసా అందడం లేదు. ఈ హామీల అమలుకు రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటల్లోకి తీసుకు రావాల్సి ఉంది అన్నారు. ఈ మహాసభలో తిరిగి సిపిఎం మండల కార్యదర్శిగా నరంపేట మండల కమిటి.
కోరబోయిన కుమారస్వామి, 14మందితో నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు. మహాసభలో పార్టి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య . సమ్మయ్య, జిల్లా కమిటీ సభ్యులు. నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, మండల నాయకులు బి. మలహాల్రావు, కే శ్రీనివాస రెడ్డి,కే కట్టయ్య, రాజుల పాటి సూరయ్య, కమటం వెంకటేశ్వర్లు, జినుకల చంద్రమౌళి, బర్రి ఆంజనేయులు, రుద్రారపు లక్ష్మీ, కొలువుల శివ, అన్వర్, పెండ్యాల సారయ్య, భాషిక మొగిలి, మంకలి శ్రీనివాస్, మూడు సుఖ్యా, వంగల వనచారి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa