కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వి.హనుమంతరావు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఫార్చునర్ కారును వేరే వాహనంతో ఢీకొని, ఆ తరువాత పెద్ద బండరాళ్లతో కారుపై విసిరారు.ఈ క్రమంలో కారు డ్యామేజ్ అయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు. కాగా ఒక సీనియర్ నేత హనుమంతరావును టార్గెట్ చేస్తూ జరిగిన దాడిని పలువురు కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa