శామీర్‌పేట వద్ద బుధవారం తెల్లవారుజామున చెట్టును కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బాధితుడిని హైదరాబాద్ వాసి ఫర్హాన్ అహ్మద్ అన్సారీగా గుర్తించారు.తుర్కపల్లి రోడ్డు వద్ద కారు డ్రైవర్ అదుపు తప్పి చెట్టును అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది. అన్సారీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa