ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2024, 03:46 PM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల విద్యాధికారి కనకరాజు అన్నారు. బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటగదిలో పరిశుభ్రతను తప్పకుండా పాటించాలని, వంటకు తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించాలని ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని అన్నారు. హాస్టల్  లో ఎలాంటి అసౌకర్యాలు ఉన్న పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, సీఆర్పీ రాజు తదితరులు  పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa