తెలంగాణ ప్రభుత్వ ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఇవాళ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ మేరకు మధ్యహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ఆల్టర్‌నేట్ రూట్లలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. తెలంగాణ విగ్రహావిష్కరణ కార్యక్రామానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు కానుండటంతో సెక్రటేరియట్ మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa