మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల మహేష్ అనారోగ్యంతో హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపతిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకుగాను ఆపరేషన్ నిమిత్తం మంజూరైన ఒక లక్ష రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే సునితారెడ్డి ఆదివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.