బీఆర్‌ఎస్ పార్టీ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల వేదమంత్రాల ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఇటీవలే అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన పరివారంతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో తొట్టెల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ ఊరేగింపులో పోతరాజులు భక్తులను అలరించారు. కవిత అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.